భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న

  • తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు అన్న బుద్దా వెంకన్న
  • ఏ నాయకుడికి లేనంత క్రేజ్ చంద్రబాబుకు ఉందని కితాబు
  • జాతీయ స్థాయిలో పెద్ద పదవులు వద్దని రాష్ట్రానికి సేవ చేస్తున్నారని వ్యాఖ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడని, భారత రాజకీయాల్లో ఆయన ఒక 'సూపర్ స్టార్' అని కొనియాడారు. దేశంలో మరే నాయకుడికి లేనంత క్రేజ్ చంద్రబాబుకు ఉందన్న ఆయన.. బాబు ఒక వ్యక్తి కాదు, ఒక సామూహిక శక్తి అని అభివర్ణించారు.


చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ... నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న అరుదైన చరిత్ర ఆయనకే దక్కిందని వెంకన్న పేర్కొన్నారు. కేవలం తెలుగు జాతిపై ఉన్న మమకారంతోనే, జాతీయ స్థాయిలో ఎన్నో పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉన్నా వాటన్నింటినీ పక్కనపెట్టి ఇక్కడే సేవ చేస్తున్నారని వెల్లడించారు.


చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య నారా భువనేశ్వరి రూ. 76 లక్షలను అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చారని తెలిపారు. పేదల ఆకలి తీర్చే ఈ మహత్కార్యానికి ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Budda Venkanna
Chandra Babu
TDP

More Telugu News